పసిడి ధరలు షేర్ మార్కెట్‌ను తలపిస్తున్నాయి. అంతర్జాతీయ ఒడిదొడుకుల ప్రభావంతో రోజుకో ధర పలుకుతోంది. ఇటీవలి అక్షయ తృతీయ సందర్భంగా కాస్తా పడిపోయిన ధరలు మళ్లీ ఊపందుకుని, మళ్లీ పడిపోయాయి. కొన్ని దేశాల్లో ఇన్వెస్టర్లు షేర్ మార్కెట్‌పై మొగ్గుచూపడం వంటి పరిణామాల కారణంగా ఈ రోజు బంగారం ధర కాస్త భారీగానే పతనమైంది.
హైదరాబాద్‌లో 22 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 750 తగ్గి రూ. 46,450కి పడిపోయింది. 24 కేరట్ల ధర రూ. 820 పడిపోయి రూ. 50,670 పలికింది. ఇక వెండి ధర కేజీకి రూ. 1,600 పడిపోయి రూ. 63,400కు చేరుకుంది. 24 కేరట్ల బంగారం ధర గత నెల గరిష్టంగా 53 వేలు దాటి పోయింది. సగటు ధర చూస్తే 50 వేల వద్ద, 22 కేరట్ల బంగారం 47 వేల వద్ద కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ధర మూడు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది.