భారీగా పడిపోయిన బంగారం ధర.. ఒక్కరోజే.. - MicTv.in - Telugu News
mictv telugu

భారీగా పడిపోయిన బంగారం ధర.. ఒక్కరోజే..

May 2, 2022

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు రోజురోజుకు క్రమంగా తగ్గుతున్నాయి. బంగారం, వెండి కొనాలని ఎదురుచూస్తున్న వారిని బంగారం షాపుల వైపు నడిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌ సహా దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,390 నుంచి 1,190 తగ్గి, 47,200కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,790 నుంచి 1,280 తగ్గి 51,510కి చేరింది.

ఇక వెండి విషయానికొస్తే, 69, 500 నుంచి 1,900 తగ్గి 67,600కి చేరింది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలతోపాటు, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ధరలు పెరుగుతున్న కారణంగా రూపాయి విలువ పడిపోతోంది. ముడి చమురు ధర బ్యారెల్ 129 డాలర్లకు చేరుకోవడంతో అది ఫారెక్స్ మార్కెట్లో రూపాయిపై ఒత్తిళ్లకు దారితీసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ జీవిత కాలంలో అత్యంత కనిష్ఠానికి చేరింది.