బంగారం మళ్లీ భగ్గు.. తాజా ధరలు ఇలా..  - MicTv.in - Telugu News
mictv telugu

బంగారం మళ్లీ భగ్గు.. తాజా ధరలు ఇలా.. 

November 9, 2020

బంగారం ధరలు మరింత పడిపోతాయని ఆశిస్తున్న ఆభరణ ప్రియులు దిగాలు పడిపోయే వార్త ఇది. పసిడి మళ్లీ పరుగులు తీస్తోంది. ఐదు రోజులుగా ధరలు కొండెక్కుతున్నయి. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లలో పుత్తడి పుంజుకుంది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం రూ. 226 పెరిగి రూ. 52,393 పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో రూ. 755 పెరిగి రూ. 66,090కు చేరుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడంతో బైడెన్ సుస్థిర ఆర్థిక వ్యవస్థను నెలకొల్పుతారన్న ఆశతో పెట్టుబడిదారులు వ్యూహం మార్చారు. కరోనా కేసులు కూడా  అదుపులోకి రాకపోవడంతో బంగారం ధరలు పెరిగాయి. 

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 580 పెరిగి రూ. 48,600 చేరింది. 24 కేరట్ల బంగారం రూ. 640 పెరిగి రూ. 53,029 వద్ద నిలిచెంది. కిలో వెండి రూ. 65,400 పలుకుతోంది. దీపావళి పండగకు చాలామంది అంతో ఇంతో బంగారం కొంటుండడం కూడా ధరలపై ప్రభావం చూపుతోంది. మరోపక్క ధరల పెరుగుదల, తగ్గుదలతో సంబంధం లేకుండా మార్కెట్లో అమ్మకాలు తగ్గిపోతున్నాయి.