బంగారు దారుణం.. 2 వేలు తక్కువ 50 వేలు  - MicTv.in - Telugu News
mictv telugu

బంగారు దారుణం.. 2 వేలు తక్కువ 50 వేలు 

May 18, 2020

tdht

చూస్తుంటే అతి త్వరలోనే బంగారం ధర అరలక్షకు చేరేలానే ఉంది. కరోనా వైరస్ ప్రభావం బంగారం మీద ఏమాత్రం లేనట్టు దారుణంగా పెరుగుతూనే ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. దీంతో మదుపరులు బంగారంపై దృష్టి సారించారు. మునుపు అయితే భూముల మీద పెట్టుబడులు పెట్టేవారు. ఇప్పుడా ఊసు మరిచిపోయి బంగారం మీద పడ్డారు. ఇలాగైతే బంగారం ధర పెరగకుండా తగ్గుతుందా? అరలక్షకు రెండు వేల తక్కువకు పసిడి రేటు అమాంతం పెరిగిపోయింది. 

ఇవాళ్టి ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,865కి చేరింది. మరికొన్ని రోజుల్లో బంగారం ధర రూ.50 వేలకు వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయంగానూ బంగారం ధరలు ఇదే రీతిలో పరుగులు తీస్తున్నాయి. అమెరికాలో కరోనా విజృంభిస్తుండటంతో  అక్కడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, చైనాతో అమెరికా వాణిజ్య పోరాటం బంగారం ధర పెరుగుదలకు కారణాలు అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. బంగారానికి పోటీగా వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి రూ.48,208 ధరకు చేరుకుంది.