Gold prices jumps in bullion markets Gold prices jumps in bullion markets
mictv telugu

బంగారం ధర మళ్లీ జంప్.. రెండు రోజుల్లో..

July 23, 2022

gold price

బంగారం ధర మళ్లీ బుగులు పుట్టిస్తోంది. కొన్నాళ్లుగా తగ్గుముఖం పడుతూ, నెలలో కనిష్ట స్థాయికి చేరిన పసిడి మళ్లీ పరుగులు తీస్తోంది. శుక్రవారం, శనివారం ధరలు భగ్గుమన్నాయి. శుక్రవారం హైదరాబాద్ నగరంలో 22 కేరట్ల ధర పదిగ్రాములకు రూ. 400 పెరగగా శనివారం రూ. 500 పెరిగి రూ. 46,900 చేరుకుంది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 540 పెరిగి, రూ. 51,160 దగ్గర నిలిచింది. పచ్చ లోహం ధరలు పెరగ్గా తెల్ల లోహం ధరలు తగ్గాయి. కిలో వెండి ధర రూ. 400 తగ్గి రూ. 61200కు చేరుకుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి భారీగా పతనం అవుతుండడం, ద్రవ్యోల్బణం వంటి అంతర్జాతీయ పరిణమాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

Gold prices jumps in bullion markets

Gold prices,  bullion markets, carat metal, silver, ornaments