భారీగా తగ్గిన బంగారం ధర - MicTv.in - Telugu News
mictv telugu

భారీగా తగ్గిన బంగారం ధర

September 11, 2019

gold.....

గత కొన్ని వారాలుగా పసిడి ధరలు గణనీయంగా పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసందే. కానీ, తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దీంతో ఆ ప్రభావం రిటైల్ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. మంగళవారం రోజున 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ఢిల్లీ మార్కెట్‌లో 39,225 రూపాయలు పలికింది. ఒకే రోజు 1500 రూపాయల తగ్గడం గమనార్హం. 

అంతర్జాతీయ మార్కెట్లో మంగళవారం ఔన్స్‌ బంగారం ధర 1494 డాలర్లుగా నమోదయ్యింది. ఇది నెలరోజుల కనిష్ట ధరగా బులియన్ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అలాగే వెండి ధర కూడా గణనీయంగా తగ్గింది. మంగళవారం ఒక్కరోజే 8 శాతం పతనమైంది. దీంతో కేజీ వెండి ధర 47వేల 405గా నమోదైంది. బంగారం వెండి ధర పతనానికి అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి బలపడడం కూడా మరో కారణం. ఇప్పుడు ధర తగ్గుతుండడంతో దసరా, దీపావళి సీజన్లలో రిటైల్ అమ్మకాలు జోరుగా సాగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు.