Gold rates today fall to near lowest in 3 months, silver prices drop
mictv telugu

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

May 11, 2022

Gold rates today fall to near lowest in 3 months, silver prices drop

మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇక ఇప్పుడంతా పెళ్ళిళ్ళ సీజన్. ఈ సమయంలో బంగారం కొనేందుకు బాగా ఆసక్తి చూపిస్తుంటారు.

ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 తగ్గి రూ. 51,380 గా నమోదు కాగా…. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గి రూ. 47,100 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గి పోయాయి. దీంతో కేజీ వెండి ధర రూ.400 తగ్గి రూ. 66,100 గా నమోదు అయింది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ దేశంలోని ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లో కూడా బంగారం , వెండి ధరలు ఒకే రకంగా ఉన్నాయి.