ముగ్గురి మలద్వారాల్లో 3 కేజీల బంగారం..  - MicTv.in - Telugu News
mictv telugu

ముగ్గురి మలద్వారాల్లో 3 కేజీల బంగారం.. 

October 12, 2020

Gold seized at Chennai International Airport, gold was being carried away in private parts, three arrested.

బంగారాన్ని అక్రమంగా తరలించడానికి చాలా పద్థతులు ఉన్నాయి. పచ్చళ్లు, కుక్కర్లు, బూట్లు, చొక్కాలు.. చాలా పాత పాత మోడల్. అందుకే కొన్నాళ్లుగా స్మగ్లర్లు కొత్త పోకడలు పోతున్నాయి. ఆడామగా తేడాలేకుండా అత్యంత సృజనాత్మక దారుల్లో గోల్డ్‌ను ఎల్లలు దాటించేస్తున్నారు. ఇప్పుడు కరోనా కాలం కూడా కావడంతో తమను ఎవరూ దగ్గరికొచ్చి తడిమి తడిమి తనిఖీ చేయరనే ధైర్యంతో మరింతగా తెగించేస్తున్నారు. 

మలద్వారంలో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేసిన ఉదంతాలు గతంలో కొన్ని ఉన్నాయి. అయితే అదేమంత పెద్దమొత్తంలో కాదు. పైగా విడి విడి కేసులు. ఆ కొరత మేం తీరుస్తామంటూ ఏకంగా ముగ్గురు ఈ బీభత్సానికి తెగించారు. మలద్వారాల్లో 3 కేజీల బంగారాన్ని దాచుకుని వచ్చిన స్మగ్లర్లను  చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు పసిడిని చిన్న ట్యూబుల్లో నింపుకుని గుదమార్గాల్లో దాచుకుని వచ్చారు. మెటల్ డిటెక్టర్లు ఆ అతితెలివిని పసిగట్టాయి. దొరికిన బంగారం విలువ రూ. 1.4 కోట్లు అని అంచనా. మంగళూరు, కొచ్చి ఎయిర్ పోర్టుల్లోనూ అక్రమ బంగారాన్ని తరలిస్తున్న ప్రయాణికులను అరెస్ట్ చేశారు. మంగళూరులో అరకేజీ బంగారం, కొచ్చిలో 130 గ్రాముల అక్రమ బంగారం బయపడింది.