వందే భారత్ విమానాల్లో అక్రమ బంగారం.. శంషాబాద్‌లో పట్టివేత - MicTv.in - Telugu News
mictv telugu

వందే భారత్ విమానాల్లో అక్రమ బంగారం.. శంషాబాద్‌లో పట్టివేత

August 15, 2020

Gold Seized In Shamshabad Airport

విదేశాలలో చిక్కుకున్నవారిని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘వందే భారత్’ పేరుతో ప్రత్యేక విమానాలు నడుపుతోంది. ఇప్పటికే లక్షలాది మంది తమ ప్రాంతాలకు చేరుకున్నారు. అయితే ఈ అవకాశాన్ని కొంత మంది అక్రమాలకు వినియోగిస్తున్నారు. కరోనా కాలంలో గుట్టుచప్పుడు కాకుండా బంగారాన్ని రవాణా చేస్తున్నారు. ఇలాగే నలుగురు వ్యక్తుల నుంచి శుక్రవారం రాత్రి శంషాబాద్‌ ఎయిర్ పోర్టు అధికారులు అక్రమ బంగారం సీజ్ చేశారు. 

రియాద్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికులను అధికారులు పరిశీలించారు. అందులో ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న837 గ్రాముల బంగారం లభించింది. ఏర్పడకుండా ఉండేందుకు వాటిని బ్యాగులోని దుస్తుల్లో భద్రపరిచారు. అయినా కూడా స్కానింగ్‌లో తేలిపోవడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ. 45.6 లక్షలు ఉంటుందని తెలిపారు నలుగురిని అదుపులోకి తీసుకొని దీని వెనక ఉన్న ముఠా గురించి తెలుసుకునేందుకు విచారిస్తున్నారు.