తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడుతున్న బంగారం షాపులు.. ఎందుకంటే? - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడుతున్న బంగారం షాపులు.. ఎందుకంటే?

May 3, 2022

ఏపీ, తెలంగాణలో బంగారం షాపులు ప్రజలతో  కిటకిటలాడుతున్నాయి. ఇందుకు కారణం మంగళవారం (ఈరోజు) అక్షయ తృతీయ రోజు కావడంతో ఏపీ, తెలంగాణ ప్రజలు బంగారం కొనాలని బంగారం షాపులకు పరుగులు తీస్తున్నారు. తెలుగు ఆచారం ప్రకారం.. ఈ అక్షయ తృతీయ రోజున కొంచమైన బంగారం కొంటే మంచిదని, లక్ష్మీదేవి దీవెనలు తమపై, కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉంటాయని ప్రజలు బాగా నమ్ముతారు.

ఈ క్రమంలో ఇదే అదునుగా చేసుకోని కొంతమంది యాజమానులు తూకంలో మోసాలకు పాల్పడ్డారు. పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఒక్కసారిగా బంగారం దుకాణాలపై దాడులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా బంగారం కొనుగోళ్ళు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.

మరోపక్క బంగారం ఆభరణాలకు రిజిస్ట్రేషన్ ముద్ర, బీఐఎస్ హాల్ మార్క్‌ను భారతీయ ప్రమాణాల సంస్థ అందిస్తోంది. ఐఎస్ఇ ముద్రతో పాటు ప్రతి తయారీదారు లైసెన్స్‌ను అందిస్తోంది. వస్తువులు కొనుగోలు చేసే వారు వీటన్నింటిని పరీక్షించుకునే విధంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది అక్షయ తృతీయకు దేశవ్యాప్తంగా దాదాపు 25-30 టన్నుల బంగారు ఆభరణాలు అమ్ముడవుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2019లో ఇది 23 టన్నులు ఉండగా, 2020లో కొవిడ్ కారణంగా కొనుగోళ్లు పెద్దగా లేవు. గతేడాది 2021లో 20 శాతం పెరగ్గా, ఈ ఏడాది పెళ్లిళ్లు, వేడుకలు కలిసి రావడంతో కొనుగోళ్లు భారీగా జరుగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు.