తగ్గేదేలే అంటున్న బంగారం.. ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

తగ్గేదేలే అంటున్న బంగారం.. ఎంతంటే?

March 7, 2022

golddd

బంగారం ధరలు మరింత పడిపోతాయని ఆశిస్తున్న ఆభరణ ప్రియులు దిగాలు పడిపోయే వార్త ఇది. పసిడి మళ్లీ పరుగులు తీస్తోంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత పది రోజులుగా ధరలు కొండెక్కుతున్నాయి. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లలో పుత్తడి పుంజుకుంది. ఎంసీఎక్స్‌లో పది గ్రాముల బంగారం రూ. 1,090 పెరిగి రూ. 53,890 పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో రూ. 1800 పెరిగి రూ. 75,200కు చేరుకుంది.

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1000 పెరిగి రూ. 49,400 చేరింది. 24 కేరట్ల బంగారం రూ. 1,090 పెరిగి రూ. 53,890 వద్ద నిలిచెంది. కిలో వెండి రూ. 75,200 పలుకుతోంది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతూ రూపాయి విలువను హరించేస్తున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్ 129 డాలర్లకు చేరుకోవడంతో అది ఫారెక్స్ మార్కెట్లో రూపాయిపై ఒత్తిళ్లకు దారితీసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ జీవిత కాలంలో అత్యంత కనిష్ఠానికి చేరింది.