కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తున్న పసిడి మళ్లీ పైపైకి పోతోంది. వరుసగా మూడో రోజూ ధర పెరిగింది. మంగళవారం నాటి ట్రేడింగ్లో రూ.160 పెరిగిన పసిడి ధర రూ.30 వేలకు చేరువైంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.29,750 పలికింది. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం, అంతర్జాతీయ సానుకూల పరిణామాలు బంగారం పెరుగుదలకు కారణమయ్యాయి. అటు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి రూ.440 పెరిగి, రూ.40,840కి చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటంతో వెండి ధరలో పెరుగుదల వచ్చింది.
Gold/Rates Hike