గోల్డెన్ బాబా..ఒళ్లంతా బంగారమే..! - Telugu News - Mic tv
mictv telugu

గోల్డెన్ బాబా..ఒళ్లంతా బంగారమే..!

July 24, 2017

మస్తు మంది బాబాలను చూసి ఉంటారు..కానీ ఈ బాబా వేరు..ఒళ్లంతా బంగారమే.. 14 న్నర కిలోల బంగారంతో కనిపిస్తున్నాడు. బాబా ఎంది..ఇంత బంగారం ఎంటీ..బాబాకు ఎక్కడదని అని అనుకుంటున్నారా..?

ఈ ఫోటో లో కనిపిస్తున్న గోల్డెన్ బాబా పేరు సుధీర్ మక్కర్. హరిద్వార్ నుంచి ఢిల్లీ వరకు 200 కిలోమీటర్లు జరిగే కన్వర్ యాత్రలో ప్రతి ఏడు పాల్గొంటాడు. గతేడాది 12.5 కిలోల ఆభరణాలతో మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఈసారి మరో 2 కేజీలు ఎక్కువ బంగారం వేసుకుని కనిపించాడు. 21 బంగారు చైన్లు, దేవుడి లాకెట్లు ఉన్న మరో 21 ఆభరణాలు ఎప్పుడూ ధరిస్తుంటాడు.

అప్పుడప్పుడు బంగారు జాకెట్‌ను ధరించి, 16 మంది మోటారు సైకిళ్లపై తోడుగా వస్తుంటే ఆయన ర్యాలీగా వెళుతుంటారు. బంగారు బాబాకు రోలెక్స్ వాచీ, ఒక బీఎండబ్ల్యూ, రెండు ఆడి కార్లు, 3 పార్చూనర్లు ఉన్నాయి. ఈయన ధరించే బంగారంలో శివుడి లాకెట్‌తో కూడిన చైన్ 2 కేజీల బరువు ఉంది. 2018లో చివరి యాత్ర చేస్తానని గోల్డెన్ బాబా అంటున్నాడు. అది తన 25వ యాత్ర అవుతుందని చెబుతున్నాడు.