బంగారం అరటిపండు...పోషకాలుండు మెండు..! - MicTv.in - Telugu News
mictv telugu

బంగారం అరటిపండు…పోషకాలుండు మెండు..!

July 7, 2017

మీరెప్పుడన్న బంగారం అరటి పండును తిన్నరా..కనీసం సూశిన్రా..లేదుకదా,కనీ ఇప్పట్నుంచి దున్యమీదికి బంగారు అరటిపండ్లు రావోతున్నయ్…ఆస్ట్రేలియా దేశంల దగ్గరి దగ్గర పన్నెండేన్లు కష్టపడి తయారు జేశిన్రు శాస్త్రవేత్తలు, అసలు బంగారు అరటి పండంటే ఎట్లుంటది…మీద బంగారం పూత వూస్తరా ఏంది అని డౌటస్తుంది గదా..కాదు, ఈపండులోపలి గుజ్జు కొంచెం బంగారు కలర్ల,కొంచెం నారింజ పండు కలర్ల ఉంటదట,అందుకనే దీనికి గోల్డెన్ బనానా అని పేరు వెట్టిన్రు.

ఇంతకీ ఇది ఎందుకు తయారుజేశిన్రంటే ..ఉంగాండా దేశంల  పౌష్టికాహారలోపం వల్ల యాడాదికి ఆరున్నర లక్షల మంది పోరగాన్లు జీవిడుస్తున్నరట,అక్కడోళ్లకు మేయిన్ ఫుడ్డు అరటిపండ్లేనట,ఇగ పొద్దూ మాపు అవ్వే తినెవర్కు విటమిన్ ఎ &ఐరన్ లోపంతోని భాదవడ్తున్రట,అందుకే ఉగాండాలోని పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతోని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గీ గోల్డెన్ అరటిపండు విత్తనాన్ని కనిపెట్టిన్రట,2020 కల్లా ఉగాండాలో ఈ బంగారు అరటి పండ్లు సాగులోకి అస్తయట,ఇండ్ల విటమిన్ ఎ & ఐరన్ పుష్కలంగా ఉంటయట. అసల్కి గీ ప్రాజెక్ట్ 2005 నుంచే.. బిల్ గేట్స్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ‌కారంతోని, వాళ్లు అందించిన ఆర్థిక సహాయంతోనే ఇన్నేండ్లు కష్టపడి గోల్డెన్ బనానాను సృష్టించాం అని చెప్తున్రు శాస్త్రవేత్తలు.కనీ గ గోల్డెన్ బనానా మనదేశం రానీకి ఇంకా ఇన్నేండ్లు వడ్తదో.