నీరజ్ చోప్రా మరో కొత్త రికార్డ్.. - MicTv.in - Telugu News
mictv telugu

నీరజ్ చోప్రా మరో కొత్త రికార్డ్..

June 15, 2022

టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ ఛాంపియన్ నీర‌జ్ చోప్రా కొత్త జాతీయ రికార్డ్ ని నెల‌కొల్పాడు. ఫిన్‌ల్యాండ్‌లో జ‌రుగుతున్న పావో నుర్మి గేమ్స్‌లో త‌న జావెలిన్‌ను 89.30 మీటర్ల దూరం విసిరి నీర‌జ్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు. గ‌త ఏడాది మార్చిలో పాటియాలాలో జ‌రిగిన ఈవెంట్‌లో 88.07 మీట‌ర్ల దూరం విసిరి చోప్రా జాతీయ రికార్డును నెల‌కొల్పిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టేశాడు. తాజాగా జ‌రిగిన గేమ్స్‌లో నీర‌జ్ చోప్రా సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించాడు. ఫిన్‌ల్యాండ్ అథ్లెట్ ఒలివ‌ర్ హిలాండ‌ర్ త‌న జావెలిన్‌ను 89.83 మీట‌ర్ల దూరం విసిరి గోల్డ్ మెడ‌ల్‌ను గెలుచుకున్నాడు. టోక్యో గేమ్స్ త‌ర్వాత నీర‌జ్ తొలిసారి ఇంట‌ర్నేష‌న‌ల్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఒలింపిక్స్ గేమ్స్ త‌ర్వాత ఇచ్చిన తొలి ప్ర‌ద‌ర్శ‌న‌లోనూ నీర‌జ్ ఇర‌గ‌దీశాడు. అసాధార‌ణ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచాడు. దాదాపు 90 మీట‌ర్ల మార్క్‌ను అత‌ను ట‌చ్ చేశాడు.