బంగారం కొనే పరిస్థితి ఉందా..? - MicTv.in - Telugu News
mictv telugu

బంగారం కొనే పరిస్థితి ఉందా..?

July 1, 2017

జీఎస్టీతో పసిడి పరుగులు పెడుతోందా..? ఆభరణాల తయారీపైనా భారం పడుతుందా..? మారిన పరిస్థితుల్లో ఎంత భారం పడుతుంది..? అసలు బంగారం కొనే పరిస్థితి ఉందా.. లేదా?

ఇప్పుడు ఆషాఢం.. తర్వాత శ్రావణం. వరలక్ష్మి వ్రతం చేసే మహిళలు బంగారం కొంటారు.పెళ్లిళ్లకు ముందుగానే బంగారం కొందామన్న జనం ఆశలపై జీఎస్టీ నీళ్లు చల్లింది. బంగారంపై 3శాతం, ఆభరణాల తయారీపై 5శాతం జీఎస్టీ విధించారు. ఫలితంగా కొనుగోలుపై పన్నుల భారం పడుతుంది. ఇది ముందుగానే తెలుసుకున్న ప్రజలు శుక్రవారమే బంగారం దుకాణాలకు క్యూ కట్టారు. చాలా ప్రాంతాల్లో జ్యుయలరీ షాపులు కిటకిటలాడాయి. ఇపుడు జీఎస్టీతో బంగారం కొనుగోళ్లపై జీఎస్టీ ప్రభావం పడుతుందని షాపుల యజమానులు అంటున్నారు.