తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. 8మంది మృతి.. - MicTv.in - Telugu News
mictv telugu

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. 8మంది మృతి..

October 22, 2018

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. 10 మందికి గాయాలపాలయ్యారు. టాటా మ్యాజిక్ వాహనాన్ని టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులు విశాఖపట్నం జిల్లా మాకవరం పాలేనికి చెందిన వారిగా గుర్తించారు. కాకినాడలో ఓ గృహ ప్రవేశానికి హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Road Accident At Gollaprolu.. 8 people Dead.. 10 people Injured  

ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ డ్రైవర్‌ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.