బ్రిటన్ పార్లమెంట్లో తెలంగాణ గోండుల డ్యాన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

బ్రిటన్ పార్లమెంట్లో తెలంగాణ గోండుల డ్యాన్స్

September 16, 2017

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యాక ఇదివరకు గుర్తింపుకు నోచుకోని సంస్కృతి, సంప్రదాయాలకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ చక్కని గుర్తింపు లభిస్తోంది. తాజాగా బ్రిటన్ పార్లమెంటు ఆవరణలో సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సలెన్స్ సంస్థ అసోం, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ గోండులు ప్రదర్శించిన గుస్సాడీ నృత్యం’, లంబాడీలు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను అలరించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో తెలంగాణ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హౌజ్ ఆఫ్ కామ‌న్స్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. నేలపై ఆదిలాబాద్ గోండుల గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి. వేడుకల్లో భారతీయ సంప్రదాయ నెమలి నృత్యాన్నీ ప్రదర్శించారు. గుస్సాడీ, లంబాడీ(తెలంగాణ) బగురుంబా (అసోం), పవరా (మహారాష్ట్ర), సంతాలి(పశ్చిమ బెంగాల్), హోజగిరి (త్రిపుర) గిరిజన నృత్యాలను ప్రదర్శించారు. తెలంగాణ  నుంచి మాదిరెడ్డి సువ‌ర్చ‌ల‌, క‌న్నె కార్తీక, త‌డినాడ రాజ‌శేఖ‌ర్‌లు తదితరులు నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొన్నారు.