చైనాలో ఒక సంస్థ ఉద్యోగానికి ప్రకటన చేసింది. అయితే ఉద్యోగానికి వచ్చేవారు తమ ముఖాన్ని మాత్రం చూపించకూడదనే కండీషన్ పెట్టింది. కాస్ట్యూమ్ మాస్క్ ధరించమని కోరింది.
ఇంటర్వ్యూకు వెళ్ళేముందు టిప్ టాప్ గా రెడీ అవుతుంటారు. టై, మంచి డ్రెస్, ముఖానికి మేకప్స్ ఇలా తప్పకుండా ఉండి తీరాలనుకుంటారు. కానీ ముఖమే చూపించకూడదని ఒక కంపెనీ ప్రకటన జారీ చేసింది.
వైరల్ గా..
చైనాలోని చెంగ్డు యాంట్ లాజిస్టిక్స్ లో స్థానం కోసం దరఖాస్తుదారులను ఇంటర్వ్యూకు పూర్తి ఫేస్ మాస్క్ లు ధరించాలని ఆదేశించింది. దీనివల్ల కంపెనీ భౌతిక రూపాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోకుండా ఉండగలనని నమ్ముతున్నది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (ఎస్సీఎమ్పీ)లోని ఒక నివేదికప్రకారం.. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ డౌయిన్ లో వైరల్ అయిన వీడియోలో.. అభ్యర్థి, ఇంటర్వ్యూయర్ ఇద్దరు పూర్తి మాస్క్ లు ధరించారు. జాబ్ ఫెయిర్ సందర్భంగా జారీ చేయబడని అవుట్ లెట్ లో ఇలా కనపడింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.
ఆందోళన వద్దని..
ఒక లాజిస్టిక్స్ కంపెనీ ఉద్యోగులను.. కొత్త మీడియా ఆపరేటర్, లైవ్ స్ట్రీమ్ బ్రాడ్ కాస్టర్, డేటా అనలిస్ట్ వంటి ఉద్యోగులకోసం అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి ఈ రెక్రూటింగ్ ఫెయిర్ నిర్వహించింది. అభ్యర్థుల ప్రదర్శన కంటే వారి సామర్థ్యాలపై దృష్టి పెట్టడం ద్వారా ఇంటర్వ్యూ చేసేవారి వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించడం దీని లక్ష్యం అని నివేదించారు. సోషల్ ఫోబియా ఉన్నవ్యక్తి ఇలాంటి ఇంటర్వ్యూ నిజంగా ఆనందాన్ని అందిస్తుంది. ఎస్సీఎమ్పీ ప్రకారం.. ఈ కాన్సెప్ట్ మాస్క్ అన్ని కంపెనీలు ధరించేలా చేస్తే మరికొంతమంది ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే అవకాశాలు పెరుగుతాయని అంటున్నది. చాలామంది అభిప్రాయం కూడా అదే!