Good luck to the topu bandi merchant.. night after night
mictv telugu

తోపుడు బండి వ్యాపారిని వరించిన అదృష్టం..రాత్రికి రాత్రే

July 14, 2022

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో రోడ్లపై పానీపూరి, ఇడ్లీ, పండ్లు, కొబ్బరికాయలు, దుస్తుల వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, జీవనం సాగించేవాళ్లను మన నిత్యం చూస్తూనే ఉంటాం. అందులో కొందరు తోపుడు బండిపై వ్యాపారం చేస్తూ, వాన, చలి, ఎండ అనే వాటిని పట్టించుకోకుండా కుటుంబం కోసం నిత్యం కష్టపడుతూనే ఉంటారు. అలాంటి వారికి అనుకోకుండా రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యే అదృష్టం వరిస్తే, ఎంత ఆనందంగా ఉంటుంది. అప్పుడు వారి సంతోషాన్ని మాటల్లో వర్ణించలేరు. అటువంటి అదృష్టమే ఓ తోపుడు బండి వ్యాపారిని వరించింది. మొదటగా వద్దన్నా, ఆ అదృష్టం తన కూతురు ద్వారా అతనికి లభించింది. మరి ఆ అదృష్టం ఏంటో? ఆ వ్యాపారి ఎవరో తెలుసుకుందామా..

పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లో నివాసం ఉంటున్న జమాల్ సింగ్…రోడ్డుపై తోపుడు బండిపై వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రోజున సెలవని ఆతడి కుమార్తె హరిసిమ్రన్ కౌర్ తండ్రికి సాయంగా దుకాణానికి వెళ్లింది. అదే సమయంలో లాటరీ టికెట్లు అమ్మే ఓ వ్యక్తి వారి దుకాణానికి వచ్చాడు. టికెట్ కేవలం రూ. 100 అని, ఒకటి కొనుగోలు చేయాల్సిందిగా వారిని కోరాడు. జమాల్ సింగ్ అందుకు నిరాకరించాడు. కానీ, అతడి కుమార్తె హరి సిమ్రన్ కౌర్.. తన తండ్రిని ఒప్పించి లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆ లాటరీని బుధవారం సాయంత్రం డ్రా తీయగా ఆ బాలిక రూ.10 లక్షలను గెలుచుకుంది. ఆ విషయం తెలిసిన వెంటనే జమాల్ సింగ్ కుటుంబంలో ఆనందం వెల్లివెరిసింది. ఆ కుటుంబం రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోయారు.