Good news: 10 percent reservation for tribals..notification issued
mictv telugu

తెలంగాణ: గిరిజ‌నులకు 10 శాతం రిజ‌ర్వేష‌న్‌..నోటిఫికేష‌న్ జారీ

October 1, 2022

Good news: 10 percent reservation for tribals..notification issued

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం గిరిజనులకు శుభవార్తను చెప్పింది. తాజాగా కేసీఆర్..గిరిజ‌నులకు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తామని, దానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను అతి త్వరలోనే జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారమే..గతరాత్రి ఆయన నోటిఫికేష‌న్‌ను జారీ చేశారు. పెంచిన 10 శాతం రిజ‌ర్వేష‌న్లు శ‌నివారం నుంచే అమ‌ల్లోకి వ‌స్తుందని, విద్య, ప్ర‌భుత్వోద్యోగ నియామ‌కాల్లో గిరిజ‌నుల‌కు ఈ రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌వుతాయ‌ని నోటిఫికేష‌న్‌లో తెలియజేశారు.

అయితే, ఇటీవలే ఆదివాసీ, గిరిజ‌నుల ఆత్మీయ స‌భ‌ హైదారబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. సభకు హాజరైన కేసీఆర్..”రాష్ట్రంలో గిరిజ‌నుల జ‌నాభాకు అనుగుణంగా వారి రిజ‌ర్వేష‌న్ 10 శాతానికి పెంచాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించి, రాష్ట్ర‌ప‌తి అనుమ‌తి కోసం కేంద్రానికి పంపింది. ఏడేండ్లు దాటినా గిరిజ‌నుల‌కు ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలుప‌లేదు. త్వరలోనే గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేస్తాం” అని ఆయన అన్నారు.

గిరిజనులకు సంబంధించి, త‌మిళ‌నాడు రాష్ట్రంలో మొత్తం రిజ‌ర్వేష‌న్లు 1994లో 50 శాతాన్ని దాటి, 69 శాతానికి పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఆ అంశాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించింది. ఆ త‌ర్వాతే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు, శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలియజేశారు.