Good news..3,068 army jobs advertisement released
mictv telugu

గుడ్‌న్యూస్..3,068 ఉద్యోగాలకు ప్రకటన విడుదల

September 3, 2022

కేంద్ర ప్రభుత్వ త్రివిధ దళాలకు చెందిన ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (హెచ్ఏఓసీ) నిరుద్యోగ యువతకు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్మీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరతున్నామని అధికారులు తెలియజేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి, తాజాగా పూర్తి వివరాలను కూడిన నోటిఫికేషన్ విడుదల చేశారు.

విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం..” మొత్తం 3,068 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో ట్రేడ్స్‌మెన్‌ మేట్‌ (2,313), ఫైర్‌మ్యాన్‌ (656), జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్ (99) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అర్హతలు..ట్రేడ్స్‌మెన్ మేట్ ఉద్యోగాలకు..10వ తరగతి, ఫైర్‌మెన్ ఉద్యోగాలకు 10వ తరగతి, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు..12వ ఉత్తీర్ణత లేదా తత్సమానాన్ని కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు సెప్టెంబర్‌, 2022వ తేదీ నాటికి 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర సమాచారం కోసం https://www.aocrecruitment.gov.in/Home.html#ను సంప్రదించండి. ఆర్మీలో చేరి, దేశ రక్షణకు సేవ చేయాలనే ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌‌లో సెప్టెంబర్‌ 21,2022వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తాం.” అని పేర్కొన్నారు.