Good news..5G services soon..first in these cities..
mictv telugu

గుడ్‌న్యూస్..త్వరలోనే 5జీ సేవలు..ముందుగా ఈ నగరాల్లోనే..

August 25, 2022

దేశ ప్రజలకు టెలికాం కంపెనీలు ఓ గుడ్‌న్యూస్ చెప్పాయి. అతి త్వరలోనే దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ప్రకటించాయి. తాజాగా జరిగిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో.. టెలికాం కంపెనీలు అయిన ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, అదానీ డేటా నెట్ వర్క్, వొడాఫోన్ ఐడియా సర్వీస్ ప్రొవైడర్లు పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ వేలంలో సుమారు రూ. 17,876 కోట్ల చెల్లింపును డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం ( డీఓటీ ) అందుకుంది. మొదటిగా డీఓటీ రేడియో తరంగాల విజయవంతమైన బిడ్డర్లు ముందస్తు చెల్లింపులను అదే రోజున స్పెక్ట్రమ్ అసైన్‌మెంట్ లేఖలను జారీ చేసింది.

ఈ 5జీ సేవల గురించి ప్రధాని ఒక ప్రకటనలో పేర్కొంటూ.. గ్రామాల్లో 5జీ, సెమీకండక్టర్ల తయారీ, ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌తో మేము డిజిటల్ ఇండియా ద్వారా అట్టడుగు స్థాయికి విప్లవాన్ని తీసుకువస్తున్నామని అన్నారు. అయితే, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఈ సేవలు దశలవారీగా అందుబాటులోకి రానున్నాయని, మొదటి దశలో 13 నగరాల్లో వేగవంతమైన 5జీ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని టెలికాం కంపెనీలు పేర్కొన్నాయి.

తాజా నివేదిక ప్రకారం…మొదటగా ఈ నగరాల్లోనే 5జీ సేవలు షూరు కాబోతున్నాయి. అందులో ముఖ్యంగా.. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే ఉన్నాయి.

మరోపక్క 29 సెప్టెంబర్ 2022న ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో భారత ప్రభుత్వం అధికారికంగా 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 4G నెట్‌వర్క్ కంటే 5జీ నెట్‌వర్క్ సేవలు 10 రెట్లు వేగంగా ఉంటుంది. స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖల జారీ తర్వాత 5జీ లాంచ్ కోసం సన్నద్ధం కావాలని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కోరారు.