Good news..Advertisement released for 1,540 more jobs in Telangana..
mictv telugu

గుడ్‌న్యూస్: తెలంగాణలో 1,540 ఉద్యోగాలకు ప్రకటన విడుదల

September 4, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శనివారం రాత్రి మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,540 ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. విడుదల చేసిన ఉద్యోగాలు..సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టులని టీఎస్‌‌పీఎస్సీ అధికారులు తెలియజేశారు.

”ఈ 1,540 ఉద్యోగాలకు..సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్ విభాగాల్లో ఇంజినీరింగ్ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. అత్యధికంగా సివిల్ ఇంజినీరింగ్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఈ 1,540 ఉద్యోగాల్లో సాగు నీటిపారుదల శాఖలోనే 704 పోస్టులు ఉన్నాయి. మిషన్ భగీరథకు సంబంధించి 302 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఈ నెల 15 నుంచి www.tspsc.gov.inలో
అందుబాటులో ఉంటుంది” అని టీఎస్ పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు.