గుడ్‌న్యూస్.. 2800 అగ్నివీర్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌న్యూస్.. 2800 అగ్నివీర్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల

July 7, 2022

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్తను చెప్పింది. ఇండియన్ నేవీలో ఖాళీగా ఉన్న 2,800 అగ్నివీర్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు తెలిపింది.

మొత్తం 2,800 అగ్నివీర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే వారు నవంబర్ 1, 1999 నుంచి ఏప్రిల్ 30, 2005 మధ్య జన్మించి ఉండాలి. ఇంటర్మీడియట్‌లో మ్యాక్స్, ఫిజిక్స్/ కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులు చదివారు, పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన స్త్రీ, పురుషులు అర్హులు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు ప్రారంభ తేదీ జులై 15,2022 ఉండగా, చివరి తేదీ జులై 22,2022వరకు ఉంటుంది. రాత పరీక్ష 2022, అక్టోబర్ మధ్య ఉంటుంది” అని అధికారులు వివరాలను వెల్లడించారు. పూర్తి వివరాలకు joinindiannavy.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.