Good news..Advertisement released for 53 more posts
mictv telugu

తెలంగాణ: గుడ్‌న్యూస్..53 పోస్టులకు ప్రకటన విడుదల

August 5, 2022

job

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో ఖాళీగా ఉన్న 53 డివిజనల్ అకౌంట్స్ (డీఏకు) గ్రేడ్-2 పోస్టుల భర్తీకి అధికారులు గురువారం సాయంత్రం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు ఈ నెల 11 నుంచి సెప్టెంబరు 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.

”తెలంగాణ రాష్ట్రంలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశాం. ఈనెల 17 నుంచి సెప్టెంబరు 6వ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. ఈ ఉద్యోగాలు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఎ) గ్రేడ్ – 2 పోస్టులు. నిరుద్యోగులు పూర్తి వివరాలకు https://www.tspsc.gov.inను సంప్రదించండి. తాజా నోటిఫికేషన్‌తో కలిపి రాష్టవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 49,481 పోస్టులకు అనుమతి లభించింది” అని అధికారులు తెలిపారు.