Good news..Another chance for the candidates who have canceled the exam
mictv telugu

గుడ్‌న్యూస్..పరీక్ష రద్దయిన అభ్యర్థులకు మరో ఛాన్స్

August 8, 2022

సీయూఈటీ యూజీ పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్ధినీ, విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సాంకేతిక కారణాల కారణంగా సీయూఈటీ యూజీ పరీక్ష రద్దయిన అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి 28 మధ్య తిరిగి పరీక్షను నిర్వహించనున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. వీరి కోసం కొత్త హాల్‌ టికెట్లను విడుదల చేస్తామని పేర్కొంది.

”దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో సాంకేతిక కారణాల కారణంగా సీయూఈటీ యూజీ పరీక్షరద్దైంది. ఆగస్టు 4 నుంచి 6 వరకు జరుగాల్సిన రెండో దశ పరీక్షల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పలు కేంద్రాల్లో పరీక్ష జరుగలేదు. తొలుత ఆగస్టు 12-14 మధ్య నిర్వహిస్తామని వెల్లడించాం. కానీ, ఈ తేదీలు మార్చాలని 15,811 మంది విద్యార్థులు అభ్యర్థించారు. పైగా వారికి కేటాయించిన నగరాల్లో కూడా మార్పులు చేయాలని కోరారు. దీంతో ఆగస్టు 24 నుంచి 28 మధ్య పరీక్ష నిర్వహించాలని నిర్ణయించాం. అలాగే, కాగా, ఆగస్టు 17, 18, 20 తేదీల్లో జరగాల్సిన మూడో దశ పరీక్ష మాత్రం యథావిధిగా జరుగుతుంది.” అని ఎన్డీఏ సీనియర్ డైరెక్టర్ సాధన పరాశర్ తెలిపారు.