గుడ్‌న్యూస్.. నెలఖరులో మరో నోటిఫికేషన్! - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌న్యూస్.. నెలఖరులో మరో నోటిఫికేషన్!

April 16, 2022

kcr

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గతకొన్ని రోజులుగా నిరుద్యోగులకు శుభవార్తల మీద శుభవార్తలు చెప్తూనే ఉంది. రాష్ట్రంలో ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న 91 వేల ఉద్యోగాలను దశలవారీగా నోటిఫికేషన్లు ఇచ్చి, భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఒకదాని వెనక ఒకటి ఉద్యోగాల ప్రకటన చేస్తూ, నిరుద్యోగులకు తీపి కబురు చెప్తుంది.

ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో (ఏప్రిల్) లేదా మే నెల మొదటి వారంలో మరో నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే 34 వేల ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో రెండు దఫాలుగా 503 గ్రూప్-1 ఉద్యోగాలతోపాటు, ఇతర ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. ఉద్యోగ ఖాళీలున్న 19 శాఖల నుంచి అవసరమైన వివరాలు సేకరించింది.

ఇందులో భాగంగా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూలను పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు పెంచింది. పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని, యూనిపాం సర్వీసులకు కూడా 3 ఏళ్లపాటు వయోపరిమితిని పొడిగిస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు మరికొద్ది రోజులలో పోలీస్ శాఖకు సంబంధించి గాని, గ్రూప్స్‌ 1,2,3 గాని నోటిఫికేషన్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం.