తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ గత నెల రోజుల నుంచి శుభవార్తల మీద శుభవార్తలు చెప్తూనే ఉంది. ఎన్నో రోజులుగా ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన నిరుద్యోగులకు ఇటీవలే పోలీసు, గ్రూప్ 1, విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసి, నిరుద్యోగులు తమ కళను సాకారం చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
ఈ క్రమంలో శుక్రవారం కేసీఆర్ సర్కార్ డ్రైవర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. అగ్నిమాపక శాఖలో ఖాళీగా ఉన్న 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి మే 21 నుంచి మే 26 రాత్రి 10 గంటల వరకు ఆల్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలకు.. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఇక, వయసు విషయానికొస్తే.. జులై 1, 2022 నాటికి 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలని, గరిష్ట వయోపరిమితి అయిదేళ్లు పెంచుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులు.. www.tslprb.in వెబ్సైట్లో పూర్తి వివరాలను ఉంచామని, మే 21వ తేదీ 8 గంటల నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.
ఇక, లైసెన్స్ విషయానికొస్తే..నోటిషికేషన్ తేదీ నాటికి రెండేళ్లు. అంతకంటే ముందు హెవీ మోటర్ వెహికిల్ లైసెన్స్ పొంది ఉండాలని, రిజర్వేషన్, తదితర పూర్తి వివరాలు వెబ్సైట్లో ఉంచామని తెలిపారు.