తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగులకు ఇటీవలే కేసీఆర్ సర్కార్ పోలీసు శాఖలో, గ్రూప్ 1 శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన ఉద్యోగాలకు ఆల్‌లైన్‌లో ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.
సోమవారం కేసీఆర్ సర్కార్ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎస్ ఎస్పీడీసీఎల్లో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల్లోని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,271 పోస్టులను భర్తీ చేస్తున్నామని, ఇందులో జూనియర్ ఇంజినీర్ 1000, సబ్ ఇంజినీర్/ఎలక్ట్రికల్ 201, అసిస్టెంట్ ఇంజినీర్/ఎలక్ట్రికల్ 70 చొప్పున ఖాళీలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ బుధవారం (మే 11) విడుదల కానుందని, అదేరోజు దరఖాస్తు ప్రక్రియ ఆరంభమవుతుందని పేర్కొన్నారు. ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఈ, బీటెక్ చేసిన వారు అర్హులని, సందేహాలకు https://tssouthernpower.com, www.tssouthernpower.cgg.in వెబ్‌సైట్‌ని సంప్రదించాలని అధికారులు కోరారు.