గుడ్‌న్యూస్.. తెలంగాణలో మరో నోటిఫికేషన్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌న్యూస్.. తెలంగాణలో మరో నోటిఫికేషన్ విడుదల

June 16, 2022

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం 33 జిల్లాల నిరుద్యోగులకు మరో శుభవార్తను చెప్పింది. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 201 సబ్ ఇంజినీర్ పోస్టులకు టీఎస్‌ ఎస్పీడీఎల్ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మొత్తం 201 పోస్టులు ఉండగా, అందులో 182 జీఆర్ పోస్టులు, 19 ఎస్ఆర్ పోస్టులు ఉన్నాయి.

అధికారులు మాట్లాడుతూ..” 201 సబ్ ఇంజినీర్ పోస్టులకు ప్రకటన వెలువడింది. ఈ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఈ ఉద్యోగాలకు వయస్సు 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌లో ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. దరఖాస్తులకు చివరి తేదీ జులై 5. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tssouthernpower.cgg.gov.in సంప్రదించాలి” అని అధికారులు అన్నారు.

మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఇప్పటివరకూ టెట్, పోలీసు, గ్రూప్-1, వైద్య, ఇప్పుడు విద్యుత్ శాఖలో నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇప్పటికే టెట్ పరీక్ష ముగియగా, ఆగస్టులో పోలీసు ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. అక్టోబరులో గ్రూప్-1 ప్రిలిమ్స జరగనుందని అధికారులు తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 201 సబ్ ఇంజినీర్ పోస్టులకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.