Home > విద్య & ఉద్యోగాలు > గుడ్‌న్యూస్..తెలంగాణలో మరో నోటిఫికేషన్ విడుదల

గుడ్‌న్యూస్..తెలంగాణలో మరో నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్తను చెప్పింది. 24 ఫుడ్‌సేఫ్టీ పోస్టుల నియామానికి గురువారం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఈ నెల 29 నుంచి ఆగస్టు 26వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను వెల్లడించింది.

"తెలంగాణలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రజారోగ్య ప్రయోగశాలలో 21 ఫుడ్‌సేఫ్టీ అధికారుల నియామకానికి ప్రకటన విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29 నుంచి ఆగస్టు 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ చూడండి" అని కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ అన్నారు.

అంతేకాదు, గ్రూప్-1 దరఖాస్తుల ఎడిట్ గడువును కూడా అధికారులు పొడిగించారు. గ్రూప్-1 దరఖాస్తులో వ్యక్తిగత వివరాల్లో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు గడువును ఈ నెల 28 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాం. రాష్ట్రంలో ఇటీవల వర్షాలతో తొలుత ప్రకటించిన గడువులోగా (ఈ నెల 21) పలువురు అభ్యర్థులు ఎడిట్ చేసుకోలేకపోయారు" అని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు.

అనంతరం ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు రిపోర్టు చేయాల్సిన గడువు ఈ నెల 25 వరకు పొడిగించినట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డోస్ తెలిపారు. గడువులోగా రిపోర్టు చేయాని విద్యార్థుల సీట్లు రద్దు చేసి, తదుపరి మెరిట్ కలిగిన వారికి కేటాయిస్తామని అన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లను సబ్మిట్ చేసి, ప్రవేశ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన సూచించారు.

Updated : 21 July 2022 9:27 PM GMT
Tags:    
Next Story
Share it
Top