భారతదేశ ప్రజలకు భారత్ బయోటెక్ అధికారులు శుభవార్తను చెప్పారు. కొవిడ్‌ను 99 శాతం నివారించే ముక్కూ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ టీకా ద్వారా హైరిస్క్ కొవిడ్-19 లక్షణాలు ఉన్న పేషెంట్లు నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రై(నాన్స్) వాడిన 24 గంటల్లోనే వైరల్ లోడ్ 94 శాతం తగ్గిందని, 48 గంటల్లో ఆల్ లోడ్ 99 శాతం తగ్గిపోయినట్టు మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌లో నిరూపితమైందని..ప్రముఖ పత్రిక ది లాన్సెట్ రీజినల్ హెల్త్ ఆగ్నేయాసియా జర్నల్ తెలిపింది. ముంబైకి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లెన్ మార్క్ దేశవ్యాప్తంగా 20 ఆస్పత్రుల్లో స్వల్ప కొవిడ్-19 లక్షణాలున్న 306 మంది ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిపై, వ్యాక్సిన్ తీసుకొని పెద్దవారిపై ఈ అధ్యయనం నిర్వహించిందని పేర్కొంది.
”ఈ అధ్యయనంలో కొవిడ్-19 లక్షణాలతో బాధపడుతున్న వారికి ఏడు రోజులపాటు ముక్కులో నాన్స్ స్ప్రే చేయడంతోపాటు, ప్రామాణిక చికిత్సను కూడా చేశారు. ముక్కు రెండు రంద్రాల్లోనూ రోజుకు ఆరుసార్లు చొప్పున ఈ నాన్స్ను వరుసగా ఏడు రోజులపాటు స్ప్రే చేశారు. డెల్ట్రా, ఒమైక్రాన్ ఉధృతంగా ఉన్న సమయాల్లోనే వైద్యులు ఈ అధ్యయనం నిర్వహించారు. వ్యాక్సిన్ తీసుకున్న, తీసుకోని వారిలోనూ ఒకే విధమైన ఫలితాలు కనిపించాయి. ముక్కులోకి వైరస్ ప్రవేశించకుండా నైట్రిక్ ఆక్సైడ్ అడ్డుకోవడంతోపాటు, వైరస్‌ను చంపేస్తోంది. వైరస్ పునరుత్పత్తిని అడ్డుకుంటోంది. అందువల్లే వైరల్ లోడ్ చాలా వేగంగా తగ్గిపోతోందని నిర్వాహకులు తెలిపారు. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందిన తర్వాత ఫాబీ స్ప్రే పేరిట నాన్స్ను భారత్‌లో విడుదల చేశారు” అని కథనంలో వెల్లడించింది.
ఇటీవలే భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ..”ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్ టీకా (నాసల్ వ్యాక్సిన్)కు క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేశాం. సమాచారంపై విశ్లేషణ కొనసాగుతోంది. ఆ సమాచారాన్ని నియంత్రణ సంస్థకు సమర్పిస్తాం. అంతా సవ్యంగా జరిగితే, ప్రపంచంలో తొలిసారి క్లినికల్‌గా నిరూపితమైన నాసల్ వ్యాక్సిన్‌ను మేం లాంచ్ చేస్తాం” అని ఆయన ఓ వార్తా పత్రకకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఈ నాసల్ వ్యాక్సిన్ మూడో దశ బూస్టర్ డోసు అధ్యయనం కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) నిపుణుల కమిటీ కొన్ని వారాల క్రితం భారత్ బయోటెక్‌కు అనుమతినిచ్చింది. తాజాగా ట్రయల్స్ పూర్తి చేసుకోవడంతో ముక్కు టీకాను అధికారులు మార్కెట్లోకి విడుదల చేశారు.