Good news..'Equipment Maintenance Policy' in force
mictv telugu

గుడ్‌న్యూస్..అమలులోకి ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’

August 14, 2022

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన గర్భిణులకు కేసీఆర్ సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక నుంచి ‘పరికరాల నిర్వహణ పాలసీ’ని అమల్లోకి తీసుకొచ్చామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లోని వైద్య పరికరాల నిర్వహణ కోసం హైదరాబాద్‌లోని టీఎస్ఎంఎస్పీడీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్’ను (పీఎంయూ), ఈ-ఉప కరణ్ పోర్టల్‌ను శనివారం ఆయన ప్రారంభించారు.

అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ..” గర్భీణులకు రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు కేసీఆర్ ఆలోచనల మేరకు రూపొందించిన ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పథకాన్ని బతుకమ్మ కానుకగా అందించనున్నాం. రక్తహీనత అధికంగా ఉన్న 8 జిల్లాల్లో వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. పేదలకు ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ దవాఖానల్లో రూ.వందల కోట్లతో ‘పరికరాల నిర్వహణ పాలసీ’ పేరుతో వైద్య పరికరాలను సమకూర్చం . కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో మరిన్ని పరికరాలు రాబోతున్నాయి. నిర్వహణకు ప్రత్యేకంగా రూపొందించిన ‘ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ పాలసీ’ (ఏఎంసీ) శనివారం నుంచి అమల్లోకి వస్తుంది” అని ఆయన అన్నారు.

అయితే, ఈ పాలసీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లు ఖర్చు చేస్తున్నదని హరీష్ రావు తెలిపారు. ఎమైనా సమస్యలు ఉంటే వెంటనే ఫిర్యాదు కోసం కాల్ సెంటర్ 8888526666క ఫోన్ చేయాలని, లేదా సూపరింటెండ్లు నేరుగా ఈ-ఉపకరణ్ పోర్టలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదు ఇక్కడి నుంచి సంబంధిత కంపెనీకి వెళ్తుందని, వారు వెంటనే స్పందించి మరమ్మతులు పూర్తి చేస్తారన్నారు. రూ.5 లక్షలకుపైగా విలువైన పరికరాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,020 ఉన్నాయని, వీటన్నింటినీ ఏఎంసీ పరిధిలోకి తెస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు.