Good News..Filling of 511 Anganwadi Posts
mictv telugu

గుడ్‌న్యూస్: 5,111 అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ

August 12, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న 5,111 అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. గురువారం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అంగన్‌వాడీ ఉద్యోగాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి, ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ అన్నారు.

తెలంగాణలో మొత్తం 5,111 ఖాళీలు ఉన్నాయి. ఇందులో అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టులు ఉన్నాయి. అయితే, ఆరోగ్యలక్ష్మి పథకం అమలు, చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ, ప్రీ-స్కూల్ నిర్వహణ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలంటే ఖాళీలు ఉండకూడదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో అంగన్‌వాడీల్లోని పోస్టుల భర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మొత్తం 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో మొత్తం ఖాళీలను 3 క్యాటగిరీలుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను, అర్హతలు, దరఖాస్తుల తేదీలు, వయసు, ఫీజు వంటి తదితర అంశాలకు సంబంధించి మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.

మరోపక్క కేసీఆర్ అసెంబ్లీలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రోజు నుంచి ఇప్పటివరకూ టెట్, పోలీస్ ఉద్యోగాలు, గ్రూప్-1 ఉద్యోగాలు, విద్యుత్ శాఖలో నోటిఫికేషన్లు విడుదలైయ్యాయి. తాజాగా మరో 5,111 అంగన్‌వాడీ టీచర్, మినీ అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.