10వ తరగతి పాసైన అభ్యర్థులకు శుభవార్త - MicTv.in - Telugu News
mictv telugu

10వ తరగతి పాసైన అభ్యర్థులకు శుభవార్త

March 1, 2022

10th

ఇండియన్ బ్యాంక్‌ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. దేశ వ్యాప్తంగా తమ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 202 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి..? అర్హతలు ఎంటీ..? ఏ విధంగా దరఖాస్తు చేయాలి..? అనే తదితర విషయాలు మీ కోసం..

1. మొత్తం ఖాళీలు.. 202

202 సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండియన్ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

2. అర్హతలు..

ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indianbank.inలో అప్లయ్ చేయాలి. 9 మార్చి 2022 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్స్‌లో ఏక్స్‌మెన్ అయిన 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీ లేదా అంతకంటే ఎక్కువ అర్హత ఉన్న అభ్యర్థులు అవకాశం లేదు.

3. వయస్సు..

ఈ ఉద్యోగాలకు 26 నుండి 29 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి కనీస విద్యార్హత 10వ తరగతి (S.S.C./మెట్రిక్యులేషన్) లేదా గుర్తింపు పొందిన రాష్ట్ర విద్యా బోర్డు నుండి తత్సమానం పాస్ అయి ఉండాలి.

4. దరఖాస్తు ఇలా చేసుకోవాలి..

> అభ్యర్థులు ముందుగా ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ indianbank.inకి వెళ్లండి.
> హోమ్‌పేజీలో కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
> ఒక కొత్త పేజీ తెరవబడుతుంది.
> అక్కడ ఇచ్చిన ‘సెక్యూరిటీ గార్డ్స్ రిక్రూట్‌మెంట్’ లింక్‌పై క్లిక్ చేయండి.
> అభ్యర్థి అభ్యర్థించిన సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా ఫారమ్‌ను సమర్పించండి.
> భవిష్యత్ సూచన కోసం అదే హార్డ్ కాపీని ఉంచండి.