ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను మంగళవారం నాడు లబ్దిదారుల ఖాతాలో జమకానున్నట్లు ప్రకటించింది. ఏపీ సీఎం జగన్ , వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ మూడో విడత నిధులు పంపిణీ చేయనున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించి మూడో విడత నిధులు విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కాగా సీఎం జగన్ ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ లో భాగంగా ఈ మధ్య పంటల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం జగన్ మంగళవారం ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.15 గంటలకు తెనాలి చేరుకుంటారు. అక్కడ 10.35 గంటలకు ధనిక అగ్రహార మార్కెట్ యార్డు ఆవరణలోని బహిరంగ సభ వేదికకు హాజరవుతారు.
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ మూడో విడతను సీఎం జగన్ రైతలకు పంపిణీ చేస్తారు. పంటలు నష్టపోయిన రైతులకు సబ్సిడీని బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అనంతరం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.