ఏపీ వాహనదారులకు శుభవార్త.. ఇక వాటితో పనిలేదు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ వాహనదారులకు శుభవార్త.. ఇక వాటితో పనిలేదు

June 8, 2022

ఏపీ వాహనదారులకు జగన్ సర్కార్ శుభవార్తను చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, పొల్యుషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ లాంటి కీలక డాక్యుమెంట్స్ విషయంలో రవాణా శాఖ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ప్రతి వాహనానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, పొల్యుషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ వంటి అన్నీ సర్టిఫికేట్లు ఒకే చోట ఉండేలా ఓ యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

‘ఆ యాప్‌లో మీ బండి నెంబర్, ఫోన్ నెంబర్‌ను నమోదు చేసుకుంటే చాలు, మొత్తం వాహన డాక్యుమెంట్స్ అన్ని దర్శనమిస్తాయి. మీరు కావాలంటే వాటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు. యాప్ ద్వారా వాటిని చూపిస్తే సరిపోతుంది.’ అని వివరాలను వెల్లడించారు.

తాజాగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ విషయంలో శుభవార్తను చెప్పిన విషయం తెలిసిందే. 2022 జూలై 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం.. ఆయా రాష్ట్రాల రవాణా శాఖలు, కేంద్ర పరిధిలోని పలు ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు కానున్నాయి. ఐదేళ్ల పాటు ఈ శిక్షణా కేంద్రాలు చెల్లుబాటులో ఉంటాయి. వీటిల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉత్తీర్ణులైనవారికి డ్రైవింగ్ టెస్టు లేకుండానే, లైసెన్స్ జారీ చేయనున్నారు. కేవలం ఆయా ట్రైనింగ్ సెంటర్ల సర్టిఫికేట్ ఉంటే సరిపోయేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని వాహనదారులు తమ వాహనాన్ని రోడ్డుపై నడుతున్నప్పుడు ఎక్కడైనా పోలీసులు ఆపితే, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, పొల్యుషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ పత్రాలను ఇంట్లో ఉన్నాయి. తేవటం మార్చిపోయాను అనే విషయాలను చెప్పకుండా రవాణా శాఖ అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు.