ఏపీ ప్రజలకు శుభవార్త.. మార్చి 27న సర్వీసులు ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ ప్రజలకు శుభవార్త.. మార్చి 27న సర్వీసులు ప్రారంభం

February 25, 2022

ఏపీ ప్రజలకు విమానయాన సంస్థ ఇండిగో శుభవార్త తెలిపింది. మార్చి 27న కడప జిల్లా నుంచి ఐదు నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయని పేర్కొంది. ఈ సేవలు చెన్నై, హైదరాబాద్‌, విజయవాడతోపాటు మార్చి 29 నుంచి విశాఖ, బెంగళూరుకు సర్వీలు ప్రారంభించనున్నట్లు ఎయిర్‌లైన్స్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇండిగో విమానాలతో అనుసంధానించిన వాటిలో దేశంలో 73వ నగరంగా కడప జిల్లా నిలవనుందని ఇండిగో తెలిపింది. కోవిడ్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే సర్వీసులు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే.

మరోపక్క కోవిడ్‌ నుంచి కోలుకునే సమయంలోనే చమురు ధరలు భారీగా పెరిగాయి. మహమ్మారి కారణంగా అన్ని రంగాలతోపాటు విమానయాన సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోవిడ్‌ సమయంలో తీవ్రంగా నష్టపోయిన లోటును పూడ్చేందుకు విమాన సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేర్లు సోమవారం డీల్స్‌లో 4 క్షీణించాయి. కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాకేష్‌ గంగ్వాల్‌ శుక్రవారం కంపెనీ బోర్డు నుంచి వైదొలిగారు.