భీమ్లానాయక్’ అభిమానులకు శుభవార్త.. ట్రైలర్ వచ్చేస్తోంది - MicTv.in - Telugu News
mictv telugu

భీమ్లానాయక్’ అభిమానులకు శుభవార్త.. ట్రైలర్ వచ్చేస్తోంది

February 18, 2022

pavan

గతకొన్ని రోజులుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా గురించి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ట్రైలర్ ఎప్పుడొస్తోంది? ఒక కచ్చితమైన తేదీని ప్రకటించండి అంటూ పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ సినిమాకు సంబంధించి శుక్రవారం చిత్రబృందం శుభవార్త చెప్పింది. ఈ నెల 25వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించింది. అంతకన్నా ముందే ఈ సినిమా నుంచి ట్రైలర్ తుఫాన్‌ను వదలాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియచేశారు.

మరోపక్క ‘భీమ్లానాయక్’మూవీ ట్రైలర్‌ను ఈ నెల 21న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ సంబరాలు జరుపుకొనే స్థాయిలో ట్రైలర్ కట్ చేస్తున్నారట. పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ యాక్టింగ్, రానా ఇగోయిస్టిక్ యాక్టింగ్, తమన్ మాసీ మ్యూజిక్ వెరసి ‘భీమ్లానాయక్’చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఓ రేంజ్‌లో షేక్ చేస్తుందని టాక్ వస్తున్న విషయం తెలిసిందే.