Good news for BSNL customers..180 days validity
mictv telugu

బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త..180 రోజుల వ్యాలీడితో

June 29, 2022

ప్రముఖ భారత టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు శుభవార్తను చెప్పింది. రూ. 1000లోపే 3జీబీ డేటాతో, 180 రోజుల వ్యాలీడితో కూడిన ఆఫర్‌తో ముందుకొచ్చినట్లు పేర్కొంది. ప్రీపెయిడ్ యూజర్ల కోసం అనేక ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

బీఎస్ఎన్ఎల్ అధికారులు మాట్లాడుతూ..”రోజుకు 3జీబీ డేటాతో కూడిన ప్యాక్‌ను రూ.997కు అందిస్తున్నాం. దీని కాలపరిమితి 180 రోజులు. 3 జీబీ రోజువారీ డేటాతోపాటు రోజుకి 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా ఉంది. 180 రోజులపాటు లోథమ్ కంటెంట్ కూడా ఉచితం. డేటా వినియోగం పూర్తయిన తర్వాత వేగం 80 కేటీపీఎసకు పడిపోతుంది. ప్రస్తుతానికి బీఎస్ఎన్ఎల్ 4జీ కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ఆయా ప్రదేశాల్లో ఈ ప్యాక్ యూజర్లకు ఎంతో ప్రయోజనకరం. రూ. 1000 లోపు 6 నెలల వ్యాలిడిటీతో, డైలీ 3జీబీ డేటా ఇతర ఏ టెలికాం సంస్థ అందించడం లేదు.” అని అన్నారు.

ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు కొన్ని ప్రాంతాల్లోనే 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలకు సంబంధించి త్వరలోనే దేశమంతటా అన్నీ ప్రాంతాలలో 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రీపెయిడ్ యూజర్ల కోసం తాజాగా రోజూ 3 జీబీ డేటా ప్యాక్‌తో కూడిన ఆఫర్‌ను రూ.997కు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 4జీ సేవలు అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో ఈ ప్యాక్ యూజర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వారు తెలిపారు.