బీటెక్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు - MicTv.in - Telugu News
mictv telugu

బీటెక్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు

May 7, 2022

తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.పూర్తి వివరాలను అధికారులు వెల్లడించారు.

”మొత్తం 40 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఈసీఈ (21), మెకానికల్ (10), సీఎస్ఈ (9) ఉన్నాయి. ఈ పోస్టులకు ఆప్లై చేసుకునే అభ్యర్థులు కనీసం 60శాతం మార్కులతో బీటెక్/బీఈ పూర్తి చేసి ఉండాలి. వీటితోపాటు గేట్-2022 వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 2022 గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణలో రూ. 54,880 జీతం చెల్లిస్తారు. ఏప్రిల్ 23 తేదీ నుంచి మే 14వరకు తేదీని పెంచాం. పూర్తి వివరాలకు https://careers.ecil.co.in/login.php వెబ్‌సైట్‌ అని సంప్రదించాలని” అని అధికారులు తెలిపారు.