Good news for constable candidates..chance to add 8 marks
mictv telugu

కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త..8 మార్కులు కలిపే ఛాన్స్

August 29, 2022

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి, అభ్యర్థులకు నిపుణులు ఓ శుభవార్తను చెప్పారు. కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష..ప్రశ్నపత్రంలో 13 తప్పులు దొర్లయని, ఈ తప్పుల విషయంలో బోర్డుకు ఫిర్యాదులు అందించామని, బోర్డు కూడా ఆమోదిస్తే, అభ్యర్థులకు గరిష్టంగా 8 మార్కులు కలిపే అవకాశం అందని పేర్కొన్నారు.

మరోపక్క ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష పత్రంలో కూడా తప్పులు దొర్లడంతో అధికారులు పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి అదనంగా 8 మార్కులను కలుపుతామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కానిస్టేబుల్ పరీక్షలో కూడా 13 తప్పులు దొర్లినట్టు నిపుణులు గుర్తించి, రాష్ట్ర పోలీసు నియామక బోర్డుకు తెలియజేశారు. దీనిపై అధికారులు చర్చించి, అందిన ఫిర్యాదులపై విచారించి, దొర్లిన తప్పులు నిజేమేనని తేలితే, ప్రతి అభ్యర్థికి అదనంగా 8 మార్కులు కలిసే అవకాశం ఉంది.