క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త - MicTv.in - Telugu News
mictv telugu

క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త

March 23, 2022

cricket

క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం శుభవార్తను తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లను నేరుగా వీక్షించేందుకు అనుమతిస్తున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనల ప్రకారం స్టేడియం సామర్ధ్యంలో 25 శాతం మందిని అనుమతిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. టాటా ఐపీఎల్ 15 సీజన్ ఈనెల 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. కాగా మార్చి 31 నుంచి దేశంలో కరోనా నిబంధనలు ఎత్తివేస్తున్న దృష్ట్యా స్టేడియంలోకి పూర్తి సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరోపక్క క్రికెట్ అభిమానులు మ్యాచ్‌ల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మ్యాచ్‌లు ప్రారంభమైతాయి. తమ అభిమాన క్రికెటర్ ఎలా ఆడుతాడు. ఎవరు గెలుస్తారు అనే విషయాలపై ఆసక్తిగా ఉన్నారు. మరికొంతమంది తమ రాష్ట్రంలో మ్యాచ్‌లు జరిగితే నేరుగా వెళ్లి చూడాలని ఆశపడుతున్నారు. ఇటువంటి సమయంలో ఐపీఎల్ నిర్వాహకులు శుభవార్తను చెప్పడం అభిమానుల్లో ఆనందాన్ని రేపుతుంది.