క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్..ఇక నుంచి - MicTv.in - Telugu News
mictv telugu

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్..ఇక నుంచి

April 1, 2022

cricket

ఐపీఎల్ 2022 మ్యాచ్‌లను టీవీల ద్వారా, పలు యాప్‌ల ద్వారా వీక్షిస్తూ, తమ అభిమాన క్రికెటర్ ఆటను వీక్షిస్తున్న అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇక నుంచి స్టేడియంలో అన్నీ మ్యాచులను నేరుగా వీక్షించే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది. ఏప్రిల్ 6 నుంచి 50 శాతం ఆక్యు పెన్సీతో నిర్వహించుకునేందుకు బీసీసీఐ శుక్రవారం అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించి ఈరోజు నుంచే మ్యాచ్ టికెట్లను అందుబాటులో ఉంటాయని ‘బుక్ మై షో’ ఓ ప్రకటనలో వెల్లడించింది.

కాగా, మెగా టీ20 టోర్నీ 15వ సీజన్ మహారాష్ట్రలోని వాంఖడే, బ్రాబెర్న్, డీవై పాటిల్, ఎంసీఏ మైదానాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్ 2 నుంచి అన్ని రకాల కరోనా నిబంధనలను ఎత్తివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బీసీసీఐ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

మరోపక్క ఇటీవలే ఐపీఎల్ మ్యాచ్‌లను నేరుగా వీక్షించేందుకు బీసీసీఐ స్టేడియం సామర్ధ్యంలో 25 శాతం మందిని అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. మార్చి 31 నుంచి దేశంలో కరోనా నిబంధనలు ఎత్తివేస్తున్న దృష్ట్యా స్టేడియంలోకి పూర్తి సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉన్నట్లు వార్తలు రావడంతో, నేడు వాటిని నిజం చేస్తూ, బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.