క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. మూహుర్తం ఫిక్స్ - MicTv.in - Telugu News
mictv telugu

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. మూహుర్తం ఫిక్స్

March 19, 2022

nbn g

క్రికెట్ అభిమానులకు ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ కారణాల వల్ల నాలుగేళ్లుగా నిర్వహించలేకపోయిన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను తిరిగి ఈ ఏడాదే ప్రారంభిస్తున్నామని తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను శనివారం ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ను నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్‌ను నిర్వహిస్తుండటంతో ఈసారి టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుందని పేర్కొంది.

మరోవైపు ఈ ఆసియా కప్‌లో ‘టీమిండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్’ జట్లతో పాటు మరో టీమ్ కూడా పాల్గొననుంది. ఇప్పటివరకు 14సార్లు ఆసియా కప్ నిర్వహించగా, అందులో టీమిండియా ఏడుసార్లు గెలిచింది. ఆ తర్వాత శ్రీలంక ఐదు సార్లు, పాకిస్థాన్‌ రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ కప్‌కు సంబంధించిన క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లు ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది. 2021 జూన్‌లోనే ఆసియాకప్ నిర్వహించాలని అనుకోగా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా  పడింది.