Good news for cricket fans..Super-4 schedule has arrived..
mictv telugu

క్రికెట్ ప్యాన్స్‌కు గుడ్‌న్యూస్..సూపర్‌-4 షెడ్యూల్‌ వచ్చేసింది..

September 3, 2022

దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు క్రికెట్ బోర్డు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆసియాకప్‌-2022లో మరోసారి భారత్-పాకిస్థాన్ పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌ సూపర్-4లో భాగంగా దుబాయ్‌ వేదికగా ఆదివారం (సెప్టెంబర్‌ 4)న జరగనుంది. ఈ క్రమంలో గతరాత్రి హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో పాకిస్థాన్ జట్టు సూపర్‌-4కు ఆర్హత సాధించింది.

ఈ క్రమంలో అంతకు ముందు హాంగ్‌కాంగ్‌పై 40 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. ఆసియాకప్ సూపర్-4కి అర్హత సాధించింది. తాజాగా ఆసియాకప్‌-2022 లీగ్‌ దశ మ్యాచ్‌లు శుక్రవారంతో ముగిశాయి. దీంతో గ్రూపు-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌ జట్లు అర్హత సాధించాయి. అనంతరం గ్రూప్‌-బి నుంచి ఆఫ్గానిస్తాన్‌, శ్రీలంక సూపర్‌-4లో అడుగు పెట్టాయి. ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌, హాంగ్‌ కాంగ్‌ జట్లు నిష్క్రమించాయి. ఇక, శనివారం నుంచి సూపర్-4 దశకు యుద్దం మొదలుకానుంది.

ఆసియాకప్‌ సూపర్‌-4 షెడ్యూల్‌ ఇదే..
సెప్టెంబర్ 3: ఆప్ఘానిస్థాన్, శ్రీలంక, (షార్జా)
సెప్టెంబర్ 4: భారత్, పాకిస్తాన్‌ (దుబాయ్)
సెప్టెంబర్ 6: శ్రీలంక, భారత్ (దుబాయ్)
సెప్టెంబర్ 7: పాకిస్తాన్‌, ఆప్ఘానిస్థాన్ (దుబాయ్)
సెప్టెంబర్ 8: భారత్, ఆప్ఘానిస్థాన్ (దుబాయ్)
సెప్టెంబర్ 9: శ్రీలంక, పాకిస్తాన్‌, దుబాయ్
ఫైనల్‌: సెప్టెంబర్ 11 (వేదిక దుబాయ్‌)