Good news for devotees going to Srisailam
mictv telugu

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

November 4, 2022

కార్తీక మాసంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 20 వరకు రాత్రివేళల్లోనూ ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాప్‌ల నుంచి శ్రీశైలంకు బస్ సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించింది. రాత్రివేళల్లో నల్లమల రిజర్వడ్ ఫారెస్ట్ చెక్ పోస్ట్‌ల వద్ద వాహనాలను నిలిపివేసి మరల ఉదయం అనుమతించేవారు. ప్రస్తుతం కార్తీక మాసం సందర్భంగా ఆర్టీసీ అధికారుల కోరిక మేరకు రాత్రి వేళలో బస్సులను నడిపేందుకు అటవీ అధికారులు అంగీకరించారు. ఈనెల 20 వరకు ఈ అవకాశాన్ని కల్పించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ ఎ.శ్రీధర్ తెలిపారు.