భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న కేధార్‌నాథ్ ఆలయం - MicTv.in - Telugu News
mictv telugu

భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న కేధార్‌నాథ్ ఆలయం

May 6, 2022

ఉత్తరాఖండ్ రాష్ట్రం మందాకిని నది సమీపంలోని గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు మళ్లీ తెరచుకున్నాయి. వేద మంత్రాల నడుమ శుక్రవారం (ఈరోజు) సీఎం పుష్కర్ సింగ్ దామి సమక్షంలో ఆలయం తలుపులను తెరిచి, స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.

 

ఆలయం ప్రత్యేకత.. ‘ఈ ఆలయం ఏప్రిల్ (అక్షయ తృతీయ), నవంబరు (కార్తీక్ పూర్ణిమ, శరదృతువు పౌర్ణమి) మధ్య మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ సమయంలోనే భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. అందుకు కారణం హిమాలయాలలో తీవ్ర మంచుతో కూడిన పరిస్థితులు ఉంటాయి. ఆ కారణంగా ఆలయాన్ని తెరిచే అనుకూల పరిస్థితులు ఉండవు. అందుకే ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఆలయాన్ని తెరిచి, కార్తీక పౌర్ణమి తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు.’

మరోప్క భక్తులకు స్వాగతం పలుకుతున్నట్టు దామి ట్విట్ చేశారు. భద్రమైన, సురక్షితమైన ప్రయాణానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా కేధార్‌నాథ్ సమీపంలోని గంగోత్రి, యుమునోత్రి నదుల సందర్శనను అధికారులు ప్రారంభించారు. అంటే చార్‌ధామ్ యాత్రకు ఇది ప్రారంభ సూచిక అని అర్చకులు తెలిపారు. కేధార్‌నాథ్ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదని, గౌరీకుండ్ నుంచి 22 కిలోమీటర్ల మేర పర్వత మార్గంలో ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.