Good news for devotees..Srivari Arjita Seva tickets will be released on 24th
mictv telugu

భక్తులకు శుభవార్త..24న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

August 22, 2022

Good news for devotees..Srivari Arjita Seva tickets will be released on 24th

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు టీటీడీ అధికారులు కాసేపటిక్రితమే ఓ శుభవార్తను చెప్పారు. ఈ నెల 24వ తేదీన (బుధ‌వారం) ఉద‌యం 10 గంట‌ల‌కు అక్టోబ‌ర్‌ నెలకు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టికెట్లను బుక్ చేసుకోవాలని కోరారు.

”కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి అక్టోబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నాం. అలాగే, అక్టోబరు నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జిత సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నాం. ఇదే నెలకు సంబంధించి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను 24న సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్‌లో విడుదల చేయనున్నాం. భక్తులు ఈ విషయాలను గుర్తించి, శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోండి” అని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.